బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (13:40 IST)

కోడి పందాలకు అనుమతి ఇవ్వండి: జగన్‌ను కోరిన ముద్రగడ

సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఐదు రోజుల పాటు కోడి పందాలకు శాశ్వతంగా అనుమతి ఇవ్వాలని కాపు ఉద్యమనేత ముద్రగడ ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ రాస్తూ.. ఆ లేఖలో కోడిపందాలకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు.  
 
పండుగుల సమయంలో ప్రజలకు పని ఉండదు కాబట్టి ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. పండుగలకు ప్రజలు జైలుకు వెళ్లేలా పరిస్థితి ఉండకూడదని కోరారు ముద్రగడ.
 
కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమ‌ని గుర్తు చేశారు. ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిప‌డ్డారు.