తప్పు చేశాను స్వామీ... నన్ను క్షమించు... ఎంపి మురళీమోహన్(Video)
తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న
తిరుమల వేంకటేశ్వరస్వామిని వెంకయ్య చౌదరి అంటూ సంబోధించి నాలుక్కకరుచుకున్నారు టిడిపి ఎంపి మురళీమోహన్. ఆ తరువాత ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సొంత పార్టీ నేతలే మురళీమోహన్‌ను హేళగా మాట్లాడారు. చాలా రోజుల తరువాత మురళీమోహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని క్షమించమని కోరుకున్నా. నేను పొరపాటున స్వామివారిని వెంకయ్య చౌదరి అని సంభోదించాను. అందుకే స్వామివారిని దర్శించుకుని క్షమించమని కోరానన్నారు మురళీమోహన్. బిజెపి-వైసిపి రహస్య ఒప్పందం కొనసాగుతోందని, ఎవరెన్ని చేసినా సరే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు మురళీమోహన్. వీడియో చూడండి.