శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By chj
Last Modified: మంగళవారం, 19 జూన్ 2018 (21:26 IST)

గోవిందా... గోవిందా...!! శ్రీవారిని ఆ పిలుపు ఎందుకు వచ్చిందో తెలుసా?

గోవిందా అంటేనే భక్తుల హృదయంలో తెలియని తన్మయత్వం. ఒక అధ్బుతమైన వైష్ణవ మాయకున్న శక్తిని గోవిందా అనే పిలుపు వెనుక భక్తుల హృదయం దాక్కొని ఉంటుందని ఆయా భక్తులకు లీలలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికి ఈ గోవిందా అనే నామం ప్రతి భక్తుడి నోట వినిపిస్తూనే ఉంది. అలాంట

గోవిందా అంటేనే  భక్తుల హృదయంలో తెలియని తన్మయత్వం. ఒక అధ్బుతమైన వైష్ణవ మాయకున్న శక్తిని గోవిందా అనే పిలుపు వెనుక భక్తుల హృదయం దాక్కొని ఉంటుందని ఆయా భక్తులకు లీలలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికి ఈ గోవిందా అనే నామం ప్రతి భక్తుడి నోట వినిపిస్తూనే ఉంది. అలాంటి ఈ నామం, పిలిస్తే పలికే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం.
 
పూర్వం ఒక ఊరిలో ఒక సద్బ్రాహ్మణుడుండేవాడు. అతను ప్రతిరోజూ తన నిత్యనైమిత్తిక క్రియల్లో భాగంగా దేవతారాధన గావించేవాడు. ఆ సమయంలో నిత్యము ఎవరో ఒక అతిథికి భోజనం పెట్టేలా ఆతిథ్య సేవను గావిస్తుండేవాడు. ఆ విధంగా ప్రతిరోజు అతిధికి భోజనం పెట్టిన తర్వాతనే తమ ఇంట్లో వారందరూ కూడా భోజనం చేసేలా నియమం పెట్టాడు. ఆ నియమానుసారంలో భాగంగా ఒక రోజు ఆ ఇంటికి ఓ అతిథి వచ్చాడు. 
 
ఆ వచ్చిన అతిథి భోజనాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆనక వారి ఇంటిల్లి పాదికీ ఎంతో ప్రీతిపాత్రమైన గోవును తనకిమ్మని అడిగాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. అందుకు ఆ అతిథికి ఎంతో కోపం వచ్చింది. అంతే విసురుగా పెద్దపెద్దగా అంగలు వేసుకుంటూ వెళ్లిపోసాగాడు. అది చూచి ఆ బ్రాహ్మణుని భార్య అతిథి కోపానికి కారణమవడం ఇష్టం లేక ఆ గోవును ఆ అతిథికే ఇచ్చేయమని చెప్పింది. 
 
ఆ మాటలకు ఆమె భర్త ఆ అతిథి వెంబడే పోతూ ఇదిగో స్వామీ... కోపగించకండి. ఇదిగో మీరడిగిన గోవును మీకిచ్చేస్తాను. తీసుకోండి... అంటూ గోవు ఇంద... అంటూ అతిథిని పిలుస్తూ వెళ్తున్నాడు. అలా ఆయన వెంట ఆయన భార్యా, పిల్లలు. ఆ ఊరి జనమంతా కూడా వెంబడే వెళ్తూ గోవు ఇంద... గోవు ఇంద... అంటూ ఒకే ఘోషతో వెళ్లసాగారు. 
 
అలా ఆ అతిథి వెళ్తూ వెళ్తూ కొండపై ఉన్న ఆలయంలోకి వెళ్లి మాయమైపోయాడు. ఆయన వెంబడే పోతూ పోతూ గోవు ఇందా... గోవు ఇందా... అనేది చెప్పి చెప్పి అదికాస్తా గోవిందా.. గోవిందా అని వారి గొంతుకల్లో కొండంతా ప్రతిధ్వనించింది. ఆ విధంగా శ్రీ స్వామియే వారి చేత గోశబ్దాలను పలికించాలని ఉద్దేశ్యంతోనే ఇదంతా చేయించాడు. అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా ఆ గోవిందా శబ్దమే ఎంతో మహత్తరమైన శబ్దంగా స్వామికి ప్రీతి పాత్రమైనది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామికి గోవిందా అనే పేరు స్థిరపడింది. గోవిందా... గోవిందా...!!