శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (16:45 IST)

జూనియర్ ప్రణయ్ పుట్టలోపు నా తండ్రిని ఉరితీయాలి : అమృత

తన భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసిన నా తండ్రిని నా బిడ్డపుట్టేలోపు ఉరి తీయాలని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అలియాస్ అమృతవర్షిణి డిమాండ్ చేసింది.

తన భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసిన నా తండ్రిని నా బిడ్డపుట్టేలోపు ఉరి తీయాలని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత అలియాస్ అమృతవర్షిణి డిమాండ్ చేసింది.
 
తన భర్తను హత్య చేసిన నిందితులందరికీ ఉరిశిక్షపడేలా చూడాలని ఆమె జిల్లా ఎస్పీ రంగనాథ్‌కి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా అమృత మీడియాతో మాట్లాడుతూ, ప్రణయ్‌ని చంపిన వాళ్లు నా బిడ్డను కూడా చంపరని లేదు. బేబీ పుట్టే లోపు ప్రణయ్‌ని చంపినవాళ్లను ఉరి తీస్తే బెటర్‌. మేము పాఠశాల నుంచి ప్రేమించుకున్నాం. మా విషయాలు ఇంట్లో వారందరికి తెలుసు కానీ. మా డాడీ, బాబాయి ప్రణయ్‌ని బెదిరించారని చెప్పారు. 
 
'ప్రణయ్‌ను ప్రేమిస్తున్నానన్న కారణంగా నన్ను ఎన్నో పర్యాయాలు కొట్టారు. నన్ను చంపి సాగర్‌లో వేస్తామని కూడా బెదిరించారు. ప్రణయ్‌ని హత్య చేసిన సమయంలో ఉన్న సీసీ ఫుటేజీని ధైర్యం లేక ఇప్పటివరకు చూడలేదు. ఈ రోజే సీసీఫూటేజీ చూశాను. ప్రణయ్‌ని కళ్లముందే చంపి వెళ్లారు. అలా నేను చూస్తానని అనుకోలేదు. మా డాడీలాంటి సైకోలు చాలామంది ఉంటారు. 60 ఏళ్లు ఉన్న వారికి కూడా భర్త చనిపోతే కూడా ఎంతో బాధ ఉంటుంది. కానీ నాకు 21 ఏళ్లు. నాకు ఎంత బాధ ఉంటుందో' అని బోరున విలపించింది.