ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 సెప్టెంబరు 2020 (08:46 IST)

నా ఓటు అమరావతికే.. కేంద్రమంత్రి

రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందని కేంద్రమంత్రి రాందాస్‌ అథ్వాలే అన్నారు.  అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు.

పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. ఈ అంశంపై ఎపి సిఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి మహిళా జెఎసి నేతలు కేంద్ర మంత్రులను కోరారు.

కేంద్ర మంత్రులు రాందాస్‌ అథ్వాలే, మురళీధరన్‌లను కలిసి, అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వినతిపత్రం అందజేశారు.