ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చేపిస్తున్న నాగార్జున!

n convention
PNR| Last Updated: సోమవారం, 14 జులై 2014 (10:20 IST)
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని తుమ్మిడికుంట చెరువుకు చెందిన కొంత భూమిని అక్రమంగా ఆక్రమించుకుని అందులో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ భవనాలను హీరో నాగార్జున ఆదేశం మేరకు ఆ సెంటర్ యాజమాన్యమే తొలగిస్తోంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఈ భవనాల అంశం హైకోర్టు పరిధిలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) నోటీసులు ఇవ్వకముందే యాజమాన్యం స్వచ్చందంగా కూల్చివేతలు చేపట్టడం గమనార్హం.

ఎన్ కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువులోని నిర్మాణాలను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం ఆదివారం నుంచి కూల్చివేత పనులు చేపట్టిన విషయం తెల్సిందే. ఒకవైపు తన కన్వెన్షన్ సెంటర్ సక్రమమేనంటూ హీరో నాగార్జున కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్న సమయంలోనే కన్వెన్షన్ సెంటర్‌లో కొంతభాగాన్ని కూల్చి వేసే చర్యలు చేపట్టడం గమనార్హం.దీనిపై మరింత చదవండి :