గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (22:51 IST)

ఏపీ పంతం నెగ్గింది.. సాగర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీళ్లొచ్చాయ్!

Nagarjuna Sagar
నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. 5వ గేట్ నుంచి 2 వేల క్యూసెక్కుల తాగునీటిని తెలంగాణ విడుదల చేసింది. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌పై ఊహించని హైడ్రామా కొనసాగుతోంది. రాత్రికి రాత్రే సాగర్ వద్ద బలగాలను మోహరించింది ఏపీ ప్రభుత్వం. 
 
పోలింగ్‌ మొదలవడానికి కొద్దిగంటల ముందు ఇది జరగడంతో ప్రాజెక్ట్‌పై తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బారికేడ్లు తొలగించడానికి ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్ట్‌పై హైడ్రామా కొనసాగింది. దీంతో నాగార్జున సాగర్ నీటి విషయంలో ఏపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. 
 
డ్యాం నుంచి కుడి కాలువకు ఒంగోలు చీఫ్ ఇంజినీర్ అధ్వర్యంలో మోటార్లకు సెపరేట్‌గా విద్యుత్ కనెక్షన్ ఇచ్చి.. అధికారులు గేట్లు ఎత్తారు.