శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 జులై 2018 (11:16 IST)

పెళ్లైన నెలకే నెల తప్పింది.. అనుమానంతో భార్యను హత్య చేసి.. తాను కూడా?

అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు భర్త. ఆపై తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన సుమలత-మిర్యాల

అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు భర్త. ఆపై తానూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా కేతేపల్లి గ్రామానికి చెందిన సుమలత-మిర్యాలగూడకు చెందిన మేకల మాధవ్ భార్యాభర్తలు. మాధవ్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 
 
వీరికి 2017 అక్టోబర్ నెల 6వ తేదీన వీరి వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులకే సుమలత నెలతప్పింది. దీంతో మాధవ్ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య కలతలు వచ్చాయి. కుటుంబపెద్దలు ఎంత నచ్చజెప్పినా మాధవ్ వినేవాడు కాదు. భార్యకు మరోవ్యక్తితో వివాహేతర సంబంధం వుండటంతో పెళ్లైన నెలకే నెల తప్పిందంటూ వేధింపులు కొనసాగించాడు. భర్త ప్రవర్తనతో విసుగు చెందిన సుమలత.. ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. 
 
ఇటీవల భర్యకోసం అత్తగారింటికి వెళ్లిన మాధవ్ తన భార్యను పంపించాలని కోరాడు. దీంతో కూతరు సుమలతను తీసుకొని ఈనెల 17న ఆమె తల్లి లింగమ్మ నల్లకుంటలోని ఇంటికి వచ్చింది. రెండు రోజుల పాటు అక్కడే వుండి అల్లుడికి సర్దిచెప్పి.. కుమార్తెను అక్కడే వదిలిపెట్టి వెళ్లింది. ఆమె అలా వెళ్లిందో లేదో సుమలత, మాధవ్ మధ్య గొడవపడటం మొదలెట్టారు.
 
దీంతో ఆవేశానికి గురైన మాధవ్ భార్యను హత్య చేశాడు. ఆపై తాను కూడా విద్యానగర్ - జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటీస్ రైలు కింద పడి మాధవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో భాగంగా ఇంటికి వెళ్లగా సుమలత మృతదేహం కనిపించింది. దాంతో అతను భార్యను హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక సమాచారంలో తేలింది.