అన్నం గోరుముద్దు గొంతులో ఇరుక్కుని చనిపోయిన ఆరేళ్ళ బాలిక

rice food
Last Updated: శనివారం, 30 మార్చి 2019 (09:25 IST)
తల్లి పెట్టే అన్నం గోరుముద్దు ఎవరికంటే ఇష్టముండదు. కానీ, అదే గోరుముద్దు కన్నబిడ్డ ప్రాణాలు తీస్తే. ఇక ఆ తల్లి దుఃఖాన్ని ఎవరుగలరు. తాజాగా తల్లి పెట్టిన గోరుముద్దు తిన ఆరేళ్ళ బాలిక కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన జిల్లా గుర్రంపోడు మండలం, కట్టవారి గూడెంలో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన కట్ట యుమున (6) అనే బాలిక స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎప్పటిలానే మార్చి 28వ తేదీ గురువారం రాత్రి చిన్నారికి తల్లి సాలమ్మ అన్నం తినిపిస్తోంది. అయితే.. ముద్ద యుమున గొంతులో ఇరుక్కపోయింది.

దీంతో శ్వాస పీల్చడం చాలా కష్టంగా మారి.. కళ్లెదుటే కూతురు యుమన చనిపోయింది. దీన్ని చూసిన సాలమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. కారం అన్నం ముద్ద తినిపించడం.. గొంతు నుండి ముద్ద కిందకు జారకపోవడంతో శ్వాస ఆడక చిన్నారి చనిపోయినట్లు భావిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :