బాలిక పుర్రెను చీల్చేసిన మేకు.. సమర్థవంతంగా తొలగించిన వైద్యులు
12 ఏళ్ల బాలిక పుర్రెను చీల్చేసిన ఓ మేకును వైద్యులు తొలగించి.. రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక పుర్రెలో మేకు గుచ్చుకుంది. దీంతో పుర్రె చీలింది. ఈ మేకును తొలగించడం కోసం వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మహారాష్ట్ర, బాల్కర్ జిల్లాలో అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతోంది.
ఆ భవనానికి సమీపంలో నడిచి వెళ్తున్న 12 ఏళ్ల బాలిక శాంతిని అనే బాలికపై కాంక్రీట్ ముక్క పడింది. ఆ కాంక్రీట్ ముక్కలోని మేకు బాలిక పుర్రెను 9మి.మి మేర చీల్చింది. దీంతో వెంటనే ఆ బాలికను ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు.
అలా బాలిక పుర్రెను చీల్చిన మేకును వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం కుదుటపడిందని.. అయినప్పటికీ నెల రోజుల తర్వాత శాంతినికి మరో ఆపరేషన్ చేయాల్సి వుందని వైద్యులు చెప్తున్నారు.