శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (08:59 IST)

నేడు హరికృష్ణ అంత్యక్రియలు.. ప్రభుత్వ లాంఛనాలతో...

కారు ప్ర‌మాదంలో మృత్యువాతప‌డిన సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. బుధవారం నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందిన విషయ

కారు ప్ర‌మాదంలో మృత్యువాతప‌డిన సినీ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరుగనున్నాయి. బుధవారం నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందిన విషయం తెల్సిందే. హరికృష్ణ పార్థివదేహానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు.
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మెహిదీపట్నం నుంచి గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, హరికృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయించారని వెల్లడించారు. 
 
ఈ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందనీ, ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ అధికారులను ఆదేశించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి కేటీఆర్‌ వివరించారు.