ఇంట్లో నుంచి బయటకురాని జగన్... బోసిపోయిన లోటస్ పాండ్
నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 13135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీడీపీ అభ్యర్థ
నంద్యాల ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలి ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ 13135 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోంది.
కాగా, నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు పలువురు నేతలు, కార్యకర్తలతో సందడిగా ఉన్న హైదరాబాదులోని లోటస్ పాండ్ వైకాపా కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు.
అలాగే, అధినేత వైఎస్ జగన్, ఇంతవరకూ తన ఇంటి నుంచి బయటకు రాలేదు. జగన్‌కు ఆరోగ్యం బాగాలేదని, అందువల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్.. నంద్యాలలో విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెల్సిందే.