శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (13:59 IST)

జగన్ బాబాతో చాలా డేంజర్.. మంత్రి అచ్చెన్నాయుడు

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానిం

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఆయన స్పందిస్తూ... జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు నిరూపించారని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం వెల్లడైన నంద్యాల ఉప ఎన్నిక ఫలితంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. 
 
దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు కులమతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారన్నారు. అందుకే నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లు ఏకపక్షంగా తీర్పునిచ్చారన్నారు. 
 
దేశంలో ఎక్కడా లేనివిధంగా, ఇంతవరకు చూడని విధంగా ఒక ఉప ఎన్నిక ప్రచారం కోసం విపక్ష నేత, వైకాపా అధినేత జగన్ ఏకంగా 15 రోజుల పాటు నంద్యాలలో తిష్టవేసి, ప్రతి ఇంటింటికి వెళ్లివెళ్లి ఓట్లు వేయమని ప్రాధేయపడినా ఓటర్లు చాలా తెలివిగా, విజ్ఞతతో తీర్పునిచ్చారన్నారు. ఈ తీర్పుద్వారా జగన్ బాబాతో చాలా డేంజర్ అని నంద్యాల ఓటర్లు తేల్చారని అచ్చెన్నాయుడు కామెంట్స్ చేశారు.