నన్నపనేని రాజకుమారి రాజీనామా

Nannapaneni
ఎం| Last Updated: బుధవారం, 7 ఆగస్టు 2019 (15:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కి స్వయంగా అందజేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నియమించిన విషయం తెల్సిందే.

గవర్నర్‌కు తన రాజీనామాను సమర్పించిన తర్వాత ఆమె మాట్లాడుతూ, 'ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యతగా రాజీనామా చేశాను. మూడేళ్ల వార్షిక నివేదికను గవర్నర్‌కు అందచేశా. నా నివేదికను చూసి గవర్నర్‌ అభినందించారు. రెండు నెలల ఆలస్యానికి మూడేళ్ల నివేదిక అడ్డంకిగా మారింది. నా హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచా. వసతి గృహాల్లో భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలి' అని ఆమె వ్యాఖ్యానించారు.దీనిపై మరింత చదవండి :