1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (17:01 IST)

చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు

Babu
టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో వున్న చంద్రబాబును నారా లోకేశ్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి ఆయనతో ములాఖత్‌ అయ్యారు. వారితో పాటు పార్టీ నేత మంతెన సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు. 
 
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. మంచి సాధించ‌బోయే విజ‌యానికి సంకేతం విజ‌య‌ద‌శ‌మి సంబ‌రమంటూ లోకేశ్‌ ట్వీట్ చేశారు. 
 
చెడుకి పోయేకాలం ద‌గ్గర ప‌డ‌టం ద‌స‌రా సందేశమన్న ఆయన, ప్రజ‌ల్ని అష్టక‌ష్టాలు పెడుతోన్న జ‌గ‌నాసురుడి పాల‌న అంత‌మే పంతంగా అంతా కలిసి పోరాడ‌దామని పిలుపునిచ్చారు. మరోవైపు నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.