1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2024 (17:17 IST)

జనాల ట్రోలింగ్ వల్ల కట్టు మాయమైంది.. జగన్‌పై నారా లోకేష్ సెటైర్లు

CM Jagan
CM Jagan
విజయవాడలో రాళ్ల దాడి జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుదుటిపై కట్టుతో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన కట్టు లేకుండా కనిపించారు. ఈ పరిణామంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందిస్తూ.. జనాల ట్రోలింగ్ వల్ల కట్టు మాయమైంది... జూమ్ చేస్తే గాయం కూడా మాయమైంది" అని లోకేష్ ఎద్దేవా చేశారు. తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పేందుకు సీఎం జగన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా పంచుకున్నారు.
 
ఏప్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్‌లో సీఎం జగన్‌పై రాళ్లతో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన నుదుటిపై ఎడమవైపు గాయం కాగా, ఆయన పక్కనే ఉన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు కూడా గాయాలయ్యాయి.
 
నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ గాయంపై విపక్ష నేతలు హేళన చేస్తూనే ఉన్నారు. ఇలాంటి చిన్నపాటి గాయాలకు కట్టు కట్టడం వల్ల సెప్టిక్ అవస్థలు వచ్చే అవకాశం ఉందని వివేకకుమార్ కుమార్తె డాక్టర్ సునీత సలహా ఇవ్వడంతో పాటు కట్టు తీసేస్తే సరి అని సూచించారు. ప్రస్తుతం ఆ కట్టు తీసేసిన తర్వాత ఆ గాయం ఎక్కడ తగిలిందా అనేంతలా  మాయం కావడంతో విపక్షాలు సెటైర్లు విసురుతున్నాయి.