శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

శ్రీవారి సేవలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ - జీవీఎల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుననారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రార్థించానని నిమ్మగడ్డ తెలిపారు. 
 
అదేవిధంగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రజలందరూ విరాళిస్తున్నారన్నారు. హిందువులకు అయోధ్య రామాలయం ఆరాధ్య దేవాలయంగా విరాజిల్లనుందన్నారు. దేశం ఆర్థిక ప్రగతి సాధించాలని శ్రీవారిని ప్రార్థించానని ఎంపీ జీవీఎల్‌ తెలిపారు.