సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (08:10 IST)

శ్రీలక్ష్మికి షాకిచ్చిన హైకోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక ఐఏఎస్ అధికారిణిగా ఉన్న శ్రీలక్ష్మికి హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. కోర్టుకు హాజరుకాకుండా డుమ్మా కొట్టడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. 
 
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ కేసులో కూడా ఆమె అరెస్టు అయి ప్రస్తుత బెయిల్‌పై ఉన్నారు. ఈ నేపథ్యంలో నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం ఈ కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 
 
ఇంకోవైపు, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనూ శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. ఈ కేసులో శ్రీలక్ష్మి ఏ6 నిందితురాలిగా ఉన్నారు. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని హైకోర్టులో గతేడాది క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..ఆ పిటిషన్‌ను కొట్టేసింది. 
 
నిబంధనలు ఉల్లంఘించి మరీ మైనింగ్ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కు కావడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న అభియోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, గతంలో పిటిషనర్‌కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.