జగన్ సీఎం అయితే.. నా పవరేంటో చూపిస్తా: లక్ష్మీపార్వతి

Lakshmi-parvati
Last Updated: ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (13:26 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పవరేంటో చూపిస్తానని వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి అన్నారు. పైగా, ఓ కోవర్టుతో టీడీపీ నేతలు తనపై నిందలు వేయించారని ఆరోపించారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు.

లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందని ఆమె సహాయకుడు కోటి ఆరోపించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కోటి వెనుక ఎవరు ఉన్నారో తేలిపోతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి... చంద్రబాబు, బాలకృష్ణతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడే బయటకు వస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు.

తన సహాయకుడు కోటి వ్యవహారశైలిపై ఆయన స్పందిస్తూ, 'దండుపాళ్యం డైరెక్టర్ ఓ రోజున కోటిని వెంటపెట్టుకుని ఓరోజు మా ఇంటికి వచ్చాడు. అమ్మా వీడు(కోటి) జూనియర్ ఆర్టిస్టుగా వేషాలు వేస్తుంటాడు' అని చెప్పాడు. దీంతో నేను మర్యాదగా పలకరించాను. ఈ సందర్భంగా మాదీ వినుకొండే అమ్మా.. ఏదైనా పనుంటే చెప్పండి అని కోటి అడిగాడు. దీంతో తాను 'ఏం వద్దులే బాబూ.. అసెంబ్లీలో మందులు ఇస్తారు మాకు. మా అమ్మకు తెచ్చిపెట్టు' అని చెప్పాను. అలా, ప్రతీనెలా మా అమ్మకు మందులు తెచ్చి ఇచ్చేవాడు.

ఇలా మా అమ్మకు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇస్తూ ఇంట్లోవాళ్లకు దగ్గరయ్యాడు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని ఇప్పుడు అర్థమవుతోందని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత చాలా మంది ప్రజలు అమితంగా గౌరవిస్తున్నారని, అభిమానం పెరిగిందన్నారు. కుటుంబ గౌరవం కోసమే తాను మౌనంగా ఉన్నాననీ, తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల చరిత్ర రోడ్డున పడుతుందని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి రాగానే తానేంటో చూపిస్తానని ఆమె హెచ్చరించారు.

గత 25 ఏళ్లుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవమానాలను తాను భరిస్తూ వచ్చానన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లను త్వరలో జైలుకు పంపకపోతే తాను ఎన్టీఆర్ భార్యనే కాదని శపథం చేశారు. ఎన్టీఆర్ మరణానికి కూడా తానే కారణమని తనపై తప్పుడు అభియోగాలు మోపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై మరింత చదవండి :