శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (15:47 IST)

ఒక్కడు పరీక్ష రాస్తే.. 12 మంది భద్రత కల్పించారు... ఎక్కడ?

ఒకే ఒక్కడు పరీక్ష రాస్తే ఏకంగా 12 మంది సిబ్బంది భద్రత కల్పించారు. అదేంటి.. ఒక్కడికి అంత మంది భద్రతనా అని ఆశ్చర్యపోకండి. అది పరీక్ష నిబంధన. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.

ఒకే ఒక్కడు పరీక్ష రాస్తే ఏకంగా 12 మంది సిబ్బంది భద్రత కల్పించారు. అదేంటి.. ఒక్కడికి అంత మంది భద్రతనా అని ఆశ్చర్యపోకండి. అది పరీక్ష నిబంధన. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం.
 
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఈనెల 6వ తేదీన తేదీ పదో తరగతి హిందీ సప్లిమెంటరీ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. దీంతో వీరు పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 
 
అయితే, తీరా పరీక్షా సమయానికి కేవలం ఒకే ఒక్కడు మాత్రమే రాగా, మిగిలిన ఆరుగురు డుమ్మా కొట్టారు. అయితే, పరీక్షల నిబంధనల మేరకు ఎంత మంది హాజరైనా సరే.. పరీక్ష పరీక్షే కాబట్టి... స్టాప్ మొత్తం విధులకు హాజరైంది. అసలు పరీక్ష రాసేందుకు ఒక్క విద్యార్థి కూడా రాకపోయినా నిబంధనల మేరకు పరీక్షా సమయం పూర్తయ్యేంత వరకు వారంతా అక్కడే ఉండాల్సిందే. 
 
అలా, ఈనెల 6వ తేదీన జరిగిన పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరుకావడంతో 12 మంది సిబ్బంది భద్రత కల్పించారు. వీరిలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ అధికారి, క్లర్క్, ఇన్విజిలేటర్, అటెండర్, ఏఎన్ఎం, ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు రెండు ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు వచ్చి తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్వ్కాడ్ అయితే 10 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ వచ్చి ఇక్కడ తనిఖీ చేసింది. మొత్తానికి ఈ ఒక్కడు పాస్ అవుతాడో లేదో ఫలితాల్లో చూడాలి.