శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (15:36 IST)

#FitnessChallenge చీరకట్టుతో వర్కౌట్స్ చేసిన ఆదా శర్మ.. వీడియో

భారత్‌లో ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఫిట్‌నెస్ ఛాలెంజ్ కోసం హీరోయిన్ ఆదా శర్మ వినూత్నంగా వర్కౌట్స్ చేసింది. చీరకట్టులో ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను అదరగొట్టింది.

భారత్‌లో ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా ఫిట్‌నెస్ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా ఫిట్‌నెస్ ఛాలెంజ్ కోసం హీరోయిన్ ఆదా శర్మ వినూత్నంగా వర్కౌట్స్ చేసింది. చీరకట్టులో ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను అదరగొట్టింది. తన యోగా నైపుణ్యాన్ని చూపెట్టింది. ఇంకా వీడియో తీసి అభిమానులతో పంచుకుంది. అంతేగాకుండా ఇతర హీరోయిన్లు తనలా చీర కట్టుకుని చేయద్దని సలహా ఇచ్చింది. 
 
భారత మహిళలా చీర కట్టుకుని ఎక్సర్ సైజ్ చేశానని, చీర కట్టుకుని వర్కవుట్స్ చేయాలన్న ఆలోచనపై సర్వహక్కులూ తనవేనని చమత్కరించింది. ఈ విషయంలో ఇతర హీరోయిన్లు తనను కాపీ కొట్టవద్దని చెప్పింది.
 
అలాగే ఈ వీడియోలో ముద్గల్ వాడుతూ కసరత్తులు చేసింది. ముద్గల్ వాడకాన్ని తాను మహారాష్ట్రలో చూశానని, ఈ కసరత్తుల వల్ల కండరాలు బలంగా మారుతాయని చెప్పింది. ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

Since this is a Fit INDIA challenge , I'm going all INDIAN.(I'm patenting the wearing saree and working out look.Other actresses pls don't copy SAREE workouts