ఏకాంతంగా శ్రీపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం జెఈవో శ్రీ పి.బసంత్‌కుమార్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలు, భక్తుల ఆరోగ్య భద్రత, అమ్మవారి వాహన సేవలు, పంచమి తీర్థం నిర్వహణపై ఆగమ సలహాదారు, జీయ్యంగార్ల ప్రతినిధులు, అధికారులతో జెఈవో కూలంకషంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఏకాంతంగా జరుగనున్న బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం రాత్రి
11-11-2020(బుధవారం) ధ్వజారోహణం చిన్నశేషవాహనం
12-11-2020(గురువారం) పెద్దశేషవాహనం హంసవాహనం
13-11-2020(శుక్రవారం) ముత్యపుపందిరి వాహనం సింహవాహనం
14-11-2020(శనివారం) కల్పవృక్ష వాహనం హనుమంతవాహనం
15-11-2020(ఆదివారం) పల్లకీ ఉత్సవం గజవాహనం
16-11-2020(సోమవారం) సర్వభూపాలవాహనం స్వర్ణరథం(సర్వభూపాల వాహనం), గరుడవాహనం
17-11-2020(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
18-11-2020(బుధవారం) రథోత్సవం(సర్వభూపాల వాహనం) అశ్వ వాహనం
19-11-2020(గురువారం) పంచమితీర్థం(వాహనమండపంలో) ధ్వజావరోహణం