ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (23:09 IST)

ఏపీలో నెమ్మదించిన కరోనావైరస్, యాక్టివ్ కేసులు 21,672 మాత్రమే

ఏపీలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా మహమ్మారి తగ్గుతున్న రాష్ట్రాల పట్టికలో ఏపీ కూడా తన స్థానాన్ని దక్కించుకుంటున్నది. గత కొన్ని వారాలుగా ఏపీలో నమోదవుతున్న కొత్త కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 21,672 మాత్రమే.
 
మరోవైపు రికవరీ రేటు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా తగ్గింది. తాజా బులెటిన్ వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 84,534 కరోనా టెస్టులు నిర్వహించగా కొత్తగా 2,849 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 436 కేసులు నమోదు కాగా అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 53 కేసులు వచ్చాయి.
 
అదే సమయంలో 3,700 మంది కరోనా నుంచి కోలుకోగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,30,731 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,02,325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6,734కు పెరిగింది.