శ్రీవారి హుండీలో పాకిస్థాన్ కరెన్సీ నోట్లు
తిరుమల శ్రీవారి హుండీలో పాకిస్థాన్ కరెన్సీ నోట్లు కానుకలుగా వచ్చి చేరుతున్నాయి. భక్తులు విదేశీ కరెన్సీ నోట్లను హుండీలో కానుకలుగా సమర్పిస్తున్నారు.
ప్రపంచంలోని 195 దేశాలుగాను... శ్రీవారి హుండీలో 157 దేశాల కరెన్సీ నోట్లను భక్తులు సమర్పించారు. అత్యధికంగా మలేషియా కరేన్సి నోట్లు 46 శాతం కాగా...తరువాత స్థానంలో యూఎస్ డాలర్ల నోట్లు 16 శాతం ఉన్నాయి.
2019-20 సంవత్సరంలో రూ.4.73 లక్షల విదేశీ కరెన్సీ నోట్లతో స్వామివారికి 27.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. కాగా 20-21 సంవత్సరంలో విదేశీ ఆదాయంపై కోవిడ్ ప్రభావం చూపింది.
2020-21లో 30 వేల 300 విదేశీ నోట్లతో రూ.1.92 కోట్లకు హుండీ ఆదాయం పరిమితమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ నోట్ల ఆదాయం మరింత తగ్గే అవకాశం ఉంది.