గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 16 జులై 2023 (17:57 IST)

జనసేనలోకి క్యూకడుతున్న వైకాపా నేతలు!

panchakarla ramesh
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార వైకాపా ప్రభుత్వం పాలనతో విసిగిపోయిన వైకాపా నేతలో పార్టీకి గుడ్‌బై చెప్పేసి ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమైపోతున్నారు. ముఖ్యంగా వైకాపా నేతలు జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే చీరాల వైకాపా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వామినాయుడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో నేత చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పేరు పంచకర్ల రమేశ్ బాబు. మాజీ ఎమ్మెల్యే. ఇప్పటివరకు విశాఖపట్టణం వైకాపా అధ్యక్షుడిగా ఉండి, ఇటీవలే రాజీనామా చేశారు. 
 
ఆయన ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత మాట్లాడుతూ, మూడు రోజుల కిందట వైకాపా విశాఖపట్టణం జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశా. ఇపుడు పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో పని చేయాలనుకుంటున్నా. ఈ నెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇపుడే పార్టీలో చేరతానని, సామాన్య కార్యకర్తలా పని చేస్తానని తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సుకు ఒక సైనికుడిలా పని చేస్తానని పంచకర్ల రమేశ్ బాబు తెలిపారు. 
 
తన అనుభవనాన్ని పార్టీ ఉపయోగించుకుంటుందని పవన్ చెప్పారన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినండ వల్లే వైకాపాను వీడినట్టు రమేశ్ వెల్లడించారు. జిల్లా అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి సంపాదించానని నిరూపిస్తే గొంతు కోసుకుంటానన్నారు. వైవీ సుబ్బారెడ్డి అంటే తను అపారమైన గౌరవం ఉందన్నారు.