శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 15 జూన్ 2018 (20:41 IST)

మేము ఫ్యాక్షనిజం చేస్తేనా... : పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

ఫ్యాక్షనిజంకు పూర్తిగా దూరంగా ఉన్నాం. మేము మా కుటుంబం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం.. కానీ మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదవుల కోసం ఎప్పుడూ మేము పాకులాడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ మా కుటుంబంలో ఉంటుంది. తెలుగుదేశం పార్ట

ఫ్యాక్షనిజంకు పూర్తిగా దూరంగా ఉన్నాం. మేము మా కుటుంబం ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం.. కానీ మమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదవుల కోసం ఎప్పుడూ మేము పాకులాడలేదు. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఎప్పుడూ మా కుటుంబంలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో కూడా మాకు సముచిత స్థానమే ఉంది.
 
అయితే గత కొన్ని నెలలుగా ఒక ఎమ్మెల్యే మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. పార్టీలో మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యే ఎవరో అనంతపురం జిల్లా ప్రజలకు తెలుసు. మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ ఎమ్మెల్యే మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ చెప్పారు పరిటాల శ్రీరామ్. 
 
ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతూ మళ్ళీ దాని జోలికి వెళితే పరిస్థితి మరో రకంగా ఉంటుందని హెచ్చరించారు పరిటాల శ్రీరామ్. ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో మళ్ళీ ప్రజలకు చూపాలంటూ మాపై మళ్ళీ విమర్శలు చేస్తే తెలుస్తుందంటున్నారు శ్రీరామ్. పరిటా శ్రీరామ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి.