గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (16:35 IST)

కోడెల ఆ పని చేసివుంటే బాగుండేది : పవన్ కళ్యాణ్

మాజీ మంత్రి, మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కోడెల మృతిపట్ల తన తరపున, పార్టీ తరపున సంతాపం తెలిపుతూ ఓ ప్రకటన చేశారు. రాజకీయపరమైన ఒడిదుడుకులు తట్టుకోలేక కోడెల తుదిశ్వాస విడవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా, తనపై వచ్చిన ఆరోపణలు, విమర్శలను రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే బాగుండేదని పవన్ అభిప్రాయపడ్డారు. కోడెల రాజకీయనాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకరుగా ఎన్నో పదవులు చేపట్టారన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.