శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (12:23 IST)

'నేను బాగుండాలి.. నేనే బాగుండాలి' :: వైకాపా నేతలకు పుట్టుకతో వచ్చిన వక్రబుద్ధి : పవన్ కళ్యాణ్

pawan kalyan
ఏపీలోని అధికార వైకాపాను తాను ఎందుకు తీవ్రంగా వ్యతిరేస్తానో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. 'నేను బాగుండాలి.. నేనే బాగుపడాలి' అన్నది వైసీపీ నాయకుడికి పుట్టుకతో వచ్చిన వక్రబుద్ధి అని అన్నారు. ఈ విషయం తాను ఎప్పుడో గుర్తించాను కాబట్టే మొదటి నుంచీ వైసీపీని వ్యతిరేకిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం తెనాలి నియోజకవర్గ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. 
 
ఇందులో నాదెండ్ల మనోహర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్‌ను గెలిపించాలని తెనాలి ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో తెనాలిలో ఎగిరేది జనసేన జెండానేనని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. 
 
జగన్ సర్కారు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు వేస్తోందని, చివరకు చెత్తపైన కూడా పన్ను వేస్తోందని పవన్ మండిపడ్డారు. పన్నులతో ప్రజల నడ్డి విరుస్తూ సేకరించిన సొమ్ముతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామంటే ఎలాగని జనసేనాని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై తాను ఊరకే కామెంట్స్ చేయలేదన్నారు. 
 
ఆ వ్యవస్థ వల్ల కలిగే నష్టాన్ని అంచనా వేసిన తర్వాతే తాను వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సమాంతర వ్యవస్థ అని చెప్పారు. దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నామని, న్యాయపోరాటం కూడా చేయనున్నట్టు తెలిపారు.