సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 31 జులై 2023 (16:59 IST)

అంబటి రాంబాబు అంటే ఎవరు: నటుడు పృథ్వీరాజ్

prithvi
ఏపీ మంత్రి, వైకాపా నేత అంబటి రాంబాబు అంటే ఎవరో తనకు తెలియదని సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన చిత్రం "బ్రో". సముద్రఖని దర్శకత్వం వహించారు. సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రను పోషించగా, పవన్ కళ్యాణ్ అతిథి పాత్రను పోషించారు. ఇందులో మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి ఓ పాత్ర ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన గురించి ఓ చిన్నపాత్రను పెట్టి పవన్ కళ్యాణ్ శునకానందం పొందారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
దీనిపై నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ, మంత్రి అంబటి రాంబాబు ఎవరో నాకు తెలియదన్నారు. "బ్రో" సినిమాలో మంత్రి అంబటి రాంబాబు పాత్రను తాను పోషించలేదన్నారు. తనకు మంత్రి అంబటి ఎవరో తెలియదన్నారు. అంబటి రాంబాబు ఆస్కార్ లెవల్ నటుడేమీ కాదు ఇమిటేట్ చేయడానికి కాదన్నారు. ఓ పనికిమాలిన వెధవ, ఓ బాధ్యత లేని వెదవ, బారుల్లో తాగుతూ, అమ్మాయిలతో డ్యాన్స్ చేసే పాత్ర అని చేయాలని డైరెక్టర్ ఆయన అన్నారు.