బిశ్వభూషణ్ హరిచందన్ తో పవన్‌కళ్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ బందర్ రోడ్డులోని రాజ్‌భవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్‌ని కలసిన పవన్‌కళ్యాణ్.. నూతన ఆంధ్రప్రదేశ్ కు తొలి గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
హరిచందన్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టినందున మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలసినట్టు తెలిపారు. పవన్‌కళ్యాణ్ తో పాటు గవర్నర్‌ని కలసిన వారిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్యాక్ సభ్యులు నాగబాబు, పాలవలస యశస్విని, మనుక్రాంత్‌రెడ్డి, పార్టీ లీగల్‌సెల్ కోఆర్డినేటర్ ప్రతాప్ తదితరులు ఉన్నారు.