జనసేనానికి డాక్టరేట్... గొప్ప వ్యక్తులు ఎందరో వున్నారు.. వారికివ్వండి..
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ తాజాగా ఒక ఉన్నత గౌరవం దక్కింది. తమిళనాడు వేల్స్ యూనివర్సిటీ వారు జనసేనానికి డాక్టరేట్ ప్రదానం చేసేందుకు ఎంపిక చేశారు. ఈ నెలలో జరగబోయే తమ యూనివర్సిటీ 14వ కన్వకేషన్ ఈవెంట్‌కి హాజరై డాక్టరేట్ అందుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం అందింది.
కానీ, పవన్ మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారని.. వారికి డాక్టరేట్ ఇవ్వాలని పవన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు ఇస్తున్న డాక్టరేట్‌ని తిరస్కరిస్తూ వేల్స్ యూనివర్సిటీకి పవన్ లేఖ రాశారు.
తనను వేల్స్ వర్శిటీ డాక్టరేట్‌కి ఎంపిక చేయడం హ్యాపీగా వుందని తెలిపారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ కారణంగా యూనివర్సిటీ 14వ కన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.