పిఠాపురం నుంచి వారాహి యాత్ర.. ఎన్నికల కోసం పవన్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా గత కొద్ది రోజుల పాటు షెడ్లలో ఉన్న వారాహి వాహనాన్ని ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ బయటకు తీసుకువచ్చారు.
గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని రౌండ్ల వారాహి పర్యటనల అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం వారాహి వాహనాన్ని బయటకు తీసుకొచ్చారు.
పిఠాపురంలో ప్రారంభమయ్యే వారాహి యాత్ర కోసం వాహనానికి ప్రత్యేక పూజలు జరిపారు. పవన్ ఎన్నికల ప్రచారం వారాహి పర్యటనల ద్వారా పిఠాపురంలో ప్రారంభమవుతుంది.