1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు... - రేపు ఢిల్లీ పర్యటన?

pawan kalyan
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల పర్యటనలను ముమ్మరం చేయనున్నారు. ఇందులోభాగంగా, ఆయన ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన మూడు దశల్లో కొనసాగనుంది. 
 
ఈ షెడ్యూల్‌లో భాగంగా, పవన్ కళ్యాణ్ తొలి రోజు పర్యటన భీమవరంలో జరిగే వివిధ సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అమలాపురం, కాకినాడి, రామజండ్రిలలో జరిగే బహిరంగ సమావేశాలకు హాజరువుతారు. ఈ పర్యటనలో భాగంగా, జనసేన పార్టీ ముఖ్య నేతలు, స్థానికంగా ఉండే ప్రముఖులు, ప్రభావశీలురైన వ్యక్తులతో పవన్ సమావేశమవుతారు. 
 
ఈ క్రమంలో టీడీపీ నేతలతోనూ ఆయన భేటీకానున్నారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నేతలు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలప్రదం కావడమే లక్ష్యంగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. 
 
రెండో దశలో పార్టీ స్థానిక కమిటీలు, కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశాలు నిర్వహిస్తారు. తన పర్యటన మూడో దశలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతారు. ఉభయగోదావరి జిల్లాల పర్యటన ముగిసిన తర్వాత ఆయన ఇతర ప్రాంతాల్లో పర్యటించేలా పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికను ఖరారు చేయనుంది.
 
మరోవైపు, జనసేనాని పవన్ కల్యాణ్ సోమవారం లేదా మంగళవారం ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాల అంశంపై బీజేపీ పెద్దలతో పవన్ చర్చించబోతున్నట్టు సమాచారం. దీంతోపాటు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై కూడా బీజేపీ హైకమాండ్‌తో చర్చించనున్నారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.