శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (17:41 IST)

పవన్ ఆదేశిస్తే... రెడ్ల తలలు తెగనరుకుతా! : జన సైనికుడు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసైనికుడు రెచ్చిపోయాడు. జనసేనాని సై అంటే.. రెడ్డిల తల తెగనరుకుతా అని హెచ్చరించారు. నేను రెడీ... మీరు రెడీనా అంటూ జనసేన పార్టీ కార్యకర్తలను ప్రశ్నించాడు. 
 
జనసేన పార్టీ ఆత్మీయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ బుధవారం చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా మదనపల్లిలో అనంతపురం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆ పార్టీ నేత సాకే పవన్ కూడా హాజరయ్యాడు. 
 
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ఆదేశిస్తే కనుక ఇప్పుడే రంగంలోకి దిగుతానని, వైసీపీ నేతల తలలు నరుకుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బనాయించే కేసులకు తమ కార్యకర్తలెవరూ భయపడే ప్రసక్తే లేదని అన్నాడు. 
 
అనంతపురం జిల్లాలో ప్రకాశ్ రెడ్డే కాదు ఏ రెడ్డి అయినా సరే, వారి తలలు నరికేందుకు 'నేను రెడీ'..'మీరు రెడీనా?' అంటూ కార్యకర్తలను ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలతో సభా వేదికపై ఉన్న పవన్ కల్యాణ్ సహా నాదెండ్ల మనోహర్ తదితర నేతలు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పార్టీ పెద్దలు ఆయన్ను శాంతపరిచారు.