ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 10 నవంబరు 2018 (18:31 IST)

మంత్రి నారా లోకేష్ ఏం పాట పాడుకుంటున్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ ట్వీట్

ఏపీ పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ ఎక్కడున్నారో తనకు తెలియడం లేదనీ, బహుశా తన తండ్రిపైన పాట పాడుకుంటూ వున్నారేమోనంటూ పవన్ కల్యాణ్ ఓ పాటను ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్ నటించిన చిత్రంలోని... పాపా కెహెతె హై బడా నామ్ కరెగా, బేటా హమారా ఐసా కామ్ కరేగా, మగర్ యే తొ కోయి న జానే, కి మేరి మంజిల్ కహా" అంటూ పాటను ట్వీట్ చేశారు. 
 
ఇంతకీ ఇలా ఎందుకు చేశారయా అంటే, బాలల సంరక్షణ ట్రస్ట్ నుంచి తనకు ఓ మెమోరాండం వచ్చిందనీ, అందులో బాలలకు అందాల్సినవి అధికారులు అందకుండా చేస్తున్నట్లు తేలిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు ఏమయినా చేస్తారేమోనంటే... ఆయన ప్రస్తుతం 2019 ఎన్నికలకు సంబంధించి పొత్తుల కోసం బిజీగా వున్నారనీ, ఆయన పార్టీ మద్దతుదారులేమో అడవులను, ఇసుకను బొక్కేస్తున్నారని విమర్శించారు. తాజాగా అనాధ బాలల ఆస్తులను కూడా నొక్కేస్తున్నట్లు అర్థమవుతుందని, మరి  మంత్రి నారా లోకేష్ పాటలు పాడుకుంటూ వున్నారేమోనంటూ ఎద్దేవా చేశారు.