గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (09:49 IST)

మీ అరుపులే మంత్రాలై.. శ్రీపాద వల్లభుడు నన్ను సీఎంను కూడా చేస్తాడు : పవన్

"మీ అరుపులే మంత్రాలే.. శ్రీపాద వల్లభుడు నన్ను ముఖ్యమంత్రిని కూడా చేస్తాడంటూ" జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. జనసేన ప్రజా పోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో జరిగిన బహిరంగ సభలో పవన్ పాల్గొని ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరూ నన్ను పిఠాపురం నుంచి పోటీచేయాలని అడుగుతున్నారు. తిరుపతి, అనంతపురం, ఇచ్ఛాపురం నుంచీ పోటీ చేయమంటున్నారు. అన్ని నియోజకవర్గాలూ నావే.. అయినా నిర్ణయం నాది కాదు.. సెలక్షన్‌ కమిటీ నిర్ణయించాలి. శ్రీపాద వల్లభుడు ఆశీస్సులు ఇచ్చి ఇక్కడి నుంచి పోటీచేయమంటే సరే.. మీ అరుపులే మంత్రాలై.. ఆయన నన్ను ముఖ్యమంత్రిని కూడా చేస్తాడు' అని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఈ బహిరంగ సభకు వచ్చిన జనసేన సైనికులు, ఫ్యాన్స్‌ అంతా సీఎం.. సీఎం.. అని ప్రసంగానికి మధ్యలో నినాదాలు చేయసాగారు. ఈ నినాదాలపై పవన్ స్పందిస్తూ, 'ఈరోజు అరుస్తాం.. వెళ్లిపోతాం.. ఆలోచన దహిస్తుంది.. అంబేద్కరలా జ్వలిస్తేనే మార్పులొస్తాయి' అని వ్యాఖ్యానించారు. ఇకపోతే, కోడి కత్తి యుద్ధంలోకి దిగితే రాజకీయాలే మారిపోయాయని వ్యాఖ్యానించారు. జగన్‌పై దాడి బాధ కలిగించిందని.. దోషులెవరో దేవుడికే తెలియాలన్నారు.