ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2020 (13:58 IST)

తెల్లారక ముందే.. గడప వద్దకే పెన్షన్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన 'గడప వద్దకే పెన్షన్‌' కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో దాదాపు 54.64 లక్షల మందికి గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ద్వారా పంపిణే చేసే కార్యక్రమం శనివారం ఉదయం ప్రారంభమైంది. 
 
రాష్ట్రవ్యాప్తంగా ఉ‍న్న వృద్ధాప్య, వికలాంగ, వితంతువులకు గ్రామ, వార్ఢు వలంటీర్లు వారి ఇంటి వద్దనే పెన్షన్‌లు అందజేస్తున్నారు. ఒక్క రోజే.. అదీకూడా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట లోపలే..

రాష్ట్రంలో ఉన్న 54 లక్షల మందికి పెన్షన్లు అందించాలన్న కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న తీరుపై పెన్షన్ దారుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

శనివారం ఉదయం వలంటీర్లు స్వయంగా లబ్ధిదారుడు ఇంటికెళ్లి పింఛన్లు పంపిణీ చేసే గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఇంతకాలం పింఛన్లు కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న ఫించన్ దారులకు డోర్ డెలివరీ విధానం ఎంతో ఆనందం కలిగిస్తోంది.

తాము ఎప్పుడు ఉంటే అప్పుడే ఇంటికొచ్చి మాకు వలంటీర్లు పింఛన్లు ఇస్తుండడం సంతోషంగా ఉందని, దీని వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.