శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (22:02 IST)

ఎవరి వల్ల రోజా ఈ స్థాయికి వచ్చిందో ప్రజలకు తెలుసు: అనిత

తాము ఎక్కడినుంచి వచ్చామన్నది మర్చిపోయి, నోటికి పనిచెబుతున్న వైసీపీనేతలు, జగన్‌వద్ద మార్కులు పొందడంకోసం, చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, నగరి ఎమ్మెల్యే రోజా ఎవరుపెట్టిన రాజకీయభిక్షతో పైకివచ్చానన్న విషయం విస్మరించి ప్రవర్తిస్తోందని టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు.

మంగళవారం ఆమె టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేలకరులతో మాట్లాడారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్‌లను విమర్శిస్తున్న రోజా, నేడు ఆమె ఆస్థాయికి రావడానికి సదరువ్యక్తులే కారణమనే సంగతి తెలుసుకోవాలన్నారు. ఓడిపోయినవాళ్లంతా దద్దమ్మలే అని రోజా భావిస్తున్నట్ల యితే, ఆమెకూడా దద్దమ్మేనన్నారు.

శాసనమండలిలో ఉన్నవారంతా భజనపరులే అని చెబుతున్న రోజా, అదే ఎమ్మెల్సీ పదవికోసం చంద్రబాబు కాళ్లుపట్టుకున్న విషయా న్ని రాష్ట్రప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీఎమ్మెల్యేలను మించిన భజనపరులు ఎవరూ లేరని కూడా ప్రజలకు అర్థమైన విషయాన్ని రోజా గ్రహించాలన్నారు.

రోజా, ఇతర వైసీపీమహిళానేతల మాటలకు జనం ఇప్పటికే నవ్వుకుంటున్నారన్నారు. అస్తమానం చంద్రబాబుని, లోకేశ్‌ని విమర్శించే రోజా, తనపార్టీ నేతలతో కలిసి చర్చకు రావాలని,  ఏఅంశంపై లోకేశ్‌తో చర్చకు వస్తుందో ఆమేచెప్పాలన్నారు.

పీఠాధిపతుల చుట్టూ తిరిగితే పదవులు వస్తాయని భావిస్తున్న వైసీపీనేతలు, తమనియోజకవర్గాల్లోని ప్రజలకు  సమాధానం చెప్పలేని స్థితికి దిగజారారని అనిత మండిపడ్డారు. అమరావతి ఉద్యమం  చేస్తున్న మహిళలగురించి చులకనగా మాట్లాడిన రోజాకు పిండప్రదానం చేయడానికి రాజధాని ఆడబిడ్డలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలపై  జరగుతున్న దాష్టీకాలు, దారుణాలు, అఘాయిత్యాల గురించి స్పందించలేని రోజా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం జరగనివాటిని జరిగినట్లుగా భూతద్దంలో చూపిందన్నా రు. వైసీపీప్రభుత్వం వచ్చిన 8నెలల్లోనే 150 మానభంగాల కేసులు నమోదయ్యాయని,   ఆనాడు నానాయాగీ చేసిన రోజాకు ఇవేవీ తెలియవా అని అనిత ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఒక్కరోజుకూడా ఒక్కబాధితురాలిని పరామర్శించని రోజా, మళ్లీ యధావిథిగా  చంద్రబాబు, లోకేశ్‌ల జపమే చేస్తున్నారన్నారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే గన్‌ కన్నాముందు, జగన్‌ వస్తాడని చెప్పిన రోజా, రాష్ట్రంలో దిశచట్టం అమలవుతుందో, లేదో సమాధానం చెప్పాలన్నారు.

జగన్‌అన్న తీసుకొచ్చిన దిశచట్టం చెత్తబుట్టపాలైంద  ని అనిత దుయ్యబట్టారు. టీడీపీఅధినేతను, లోకేశ్‌ను విమర్శించే ముందు తాము  సూచించిన సవాల్‌ని రోజా స్వీకరించాలన్నారు. చంద్రబాబుని ఎందుకు తరిమికొట్టాలో చెప్పాలన్న అనిత, కియాను తీసుకొచ్చినందుకా.. కరవు ప్రాంతంలో వరిపండేలా నీటిని పారించినందుకు తరిమికొట్టాలో రోజా చెప్పాలన్నారు.

విశాఖకు వచ్చిన పరి శ్రమలను తరిమేసి, సుజల స్రవంతి వంటి పథకాలను నిలిపివేసిన జగన్‌, తనభూముల్ని అమ్ముకోవడానికే విశాఖలో రాజధాని అంటున్నాడన్నారు. ఎవరు ఎవర్ని తరిమికొట్టా లో, ఎవరు ఎవర్ని గెలిపించాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

నగరి ప్రజలు తమ ఎమ్మెల్యే ఎక్కడుందో కనుక్కోవాలని స్టూడియోల చుట్టూ తిరుగుతుంటే, రోజా మాత్రం పీఠాధిపతులు చుట్టూ తిరుగుతోందన్నారు. రోజా పద్ధతి మార్చుకోకుండా అదే తీరుగా ప్రవర్తిస్తే, త్వరలోనే ఆమె బతుకు జట్కా బండి అవడం ఖాయమని అనిత ఎద్దేవాచేశారు.