శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 29 అక్టోబరు 2021 (10:48 IST)

వామ్మో... ఆగ‌ని పెట్రో మంట‌! గుంటూరులో లీట‌రు రూ.115

దేశంలో పెట్రోల్ మంట‌లు రోజు రోజుకూ చెల‌రేగిపోతున్నాయి.పెట్రో కంపెనీలు త‌మ బాదుడు ఆప‌డం లేదు. ఈ రోజు కూడా మళ్లీ ఇంధన ధరలు పెరిగాయి. దేశంలో ఇంధన ధరల‌ను మరోసారి పెంచేశారు. 
 
లీటర్​ పెట్రోల్​, డీజిల్​పై 35 పైసలు చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దేశంలో చమురు ధరలపై పెంపు గ‌త కొద్ది నెల‌లుగా కొనసాగుతోంది. ఇపుడు ఇంధన ధరలు మరోసారి పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తాజాగా పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు 35పైసలు పెంచుతున్నట్లు తెలిపాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.108.64కు చేరగా.. డీజిల్​ ధర రూ.97.38కు పెరిగింది.
 
ముంబయిలో లీటర్​ పెట్రోల్​​ ధర 34 పైసలు పెరిగి,  రూ.114.44కు చేరగా, లీటర్​ డీజిల్ 37 పైసలు పెరిగి​​ రూ.105.45 వద్ద కొనసాగుతోంది. కోల్​కతాలో లీటర్​ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.109.08గా ఉంది. లీటర్​ డీజిల్ ధర 35 పైసలు పెరిగి రూ.100.45 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.105.40 వద్ద కొనసాగుతోంది. లీటర్​ డీజిల్ ధర 33 పైసలు రూ.101.55కు చేరింది.  హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.112.96కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.18 కి చేరింది. గుంటూరులో పెట్రోల్ ధర లీటర్​కు రూ.114.95కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.56 వద్ద కొనసాగుతోంది. వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.68 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.33కి చేరింది.