శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 అక్టోబరు 2021 (09:06 IST)

దేశంలో కొనసాగుతున్న పెట్రోల్ ధర దూకుడు

దేశంలో పెట్రోల్ ధరల దూకుడు కొనసాగుతుంది. ప్రతీ రోజు పెరుగుతూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం కూడా ఈ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజల్ ధరలపై 35 పైసలు చొప్పున ఆయిల్ కంపెనీలు పెంచాయి. 
 
తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.108.64కు పెరగగా డీజిల్‌ ధర 97.37కు ఎగబాకింది. ఇక, ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.114.47కు, డీజిల్‌ ధర రూ.105.49కు ఎగిసాయి.. కోల్‌కతాలో పెట్రోల్‌, డీజిల్‌ ధర వరుసగా రూ.109.02, రూ.100.49 చేరుకున్నాయి.
 
మరోవైపు చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.43కి, లీటర్‌ డీజిల్‌ ధర రూ.101.59గా ఉన్నాయి. ఇక, హైదరాబాద్‌ విషయానికి వస్తే.. పెట్రోల్‌పై 37 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113కు చేరితే డీజిల్‌ ధర రూ.106.22గా పలుకుతోంది.