1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 మే 2024 (15:09 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారనుంది : ప్రధాని నరేంద్ర మోడీ

narendra modi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతుందని, జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరుపుతుందన్నారు. ఈ ఫలితాల తర్వాత ఏపీలో అధికారం మారబోతుందని ఆయన చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో పలు టీవీ చానెళ్లకు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూల ఇస్తున్నారు. వీటిలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై స్పందించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ఆ రాష్ట్రంలో మిత్రపక్షాలను కలుపుకుని వెళ్తామని ప్రధాని తెలిపారు. తెలంగాణ ఎన్నికలపై ఆయన స్పందించారు. తెలంగాణలో బీజేపీకి మంచి ఫలితాలు రాబోతున్నాయన్నారు. ఏ పని జరగాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందేనన్నారు. తెలంగాణలో ప్రస్తుతం డబుల్ ఆర్ ట్యాక్స్ నడుస్తోందని ప్రధాని మోడీ విమర్శలు చేశారు. అన్నింటికీ జూన్ నాలుగో తేదీ తర్వాత ఫుల్‌స్టాఫ్ పడుతుందని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పలు చోట్ల పర్యటించి కూటమి తరపున ప్రసంగించనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో ప్రధాని పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు సర్వం సిద్ధం చేస్తున్నారు. జనసమీకరణతో పాటు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెల్సిందే.