కిరీటాల దొంగ దొరికాడు... అక్కడికెళ్లి పట్టుకొచ్చారు...

govindaraja temple
ప్రీతి చిచ్చిలి| Last Modified బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (12:20 IST)
గత శనివారం తిరుపతి నగరంలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు కిరీటాలు కనిపించకుండా పోయిన విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపిన పోలీసులు ఆరు బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందుకోసం ఆలయాన్ని కూడా మూసివేసి రహస్య విచారణ జరిపారు.

అయితే గుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా పరిగెడుతూ, చేతిలో ఏవో వస్తువులను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు అతడిని ముత్తయ్యగా నిర్ధారించి, అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఇతడు గతంలో కూడా కొన్ని దేవాలయాలలో దొంగతనాలు చేసాడు. కిరీటాలను దొంగిలించాక తమిళనాడు పారిపోయినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :