గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , గురువారం, 9 సెప్టెంబరు 2021 (13:32 IST)

నరసరావుపేటలో144 సెక్షన్...టెన్ష‌న్...టెన్ష‌న్!

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో అంతా టెన్ష‌న్ టెన్ష‌న్ గా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నరసరావుపేట పర్యటన వ‌ల్ల ఇక్క‌డ యుద్ధ‌వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. పోలీసులు ముందు చూపుతో నరసరావుపేటలో 144వ సెక్షన్ విధించారు.
 
నారా లోకేష్ పర్యటనకు ఎటువంటి అనుమతులు లేవని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేయడంతో పాటు, నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పార్టీ కార్యాలయం వ‌ద్ద‌కు ఎవ‌రూ  రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు, కంచెలు ఏర్పాటు చేశారు.
 
అస‌లు లోకేష్ గుంటూరుకు చేర‌కుండానే పోలీసులు ముంద‌స్తు ప్ర‌ణాళిక వేసుకున్నారు. ఆయ‌న హైద‌రాబాదు నుంచి గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్ట్ కి చేర‌గానే, అక్క‌డే అడ్డుకున్నారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట ప‌ర్య‌ట‌న‌కు ప‌ర్మిష‌న్ లేద‌ని పోలీసులు లోకేష్ ని అదుపులోకి తీసుకున్నారు.