శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (12:56 IST)

గ్రామాల్లో మొద‌లైన రాజ‌కీయ క‌క్ష‌లు...కొప్ప‌ర్రులో టీడీపీ నేత గృహ‌ ద‌హ‌నం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డటంతో, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప‌లు గ్రామాల్లో రాజ‌కీయ క‌క్ష‌లు మ‌రోసారి వెలుగు చూస్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో పొడ‌చూపిన విభేదాలు, ఇపుడు మ‌ళ్లీ ఫ‌లితాల వెల్ల‌డితో భ‌గ్గుమంటున్నాయి.
 
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో  వినాయకుడి ఊరేగింపులో టి.డి.పి., వై.సి.పి  కార్యకర్తల మధ్య వివాదం చెల‌రేగింది. ఇరు వ‌ర్గాల మ‌ధ్య గొడ‌వ చినికి, చినికి గాలివాన‌లా మారింది. వై.సి.పి కార్య‌క‌ర్త‌లు కొంద‌రు టి.డి.పి. మాజీ ఎంపీటీసీ స‌భ్యుడు వేణు ఇంట్లో  చొరబడి అడ్డం వచ్చిన వారిని చితకబాదారు. ఇంట్లో షర్నిచర్ ని  తగలబెట్టారు. 
 
ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణలో ఇద్ద‌రికి గాయ‌లు కాగా, వారిని అంబులెన్స్ లో హాస్పటల్ కి తరలించారు. ఈ దాడి సంఘ‌ట‌న‌లో కొన్ని బైక్ ల‌ను కూడా పెట్రోలు పోసి అగ్గి అంటించేశారు. చివ‌రిలో పోలీసులు వ‌చ్చి, ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేశారు.