సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2023 (14:13 IST)

కేంద్రానికి ఫిర్యాదు చేస్తే వణికిపోతామా? మంత్రి గుడివాడ

gudivada amarnath
వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే మాకేం భయమా అంటూ ప్రశ్నించారు. కేంద్రానికే కాదు.. కావాలంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధినేత వ్లాదిమిరి పుతిన్‌లకు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చంటూ ఎద్దేవా చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్‌కు అంత పలుకుబడివుంటే  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ విసిరారు. వైజాగ్ పర్యటనలో పవన్ కళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ వైఖరేంటే బహిర్గతం చేయాలని మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. 
 
మరోవైపు, మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మంత్రివర్యులు తీసుకున్న చర్యలు ఏంటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈయన హయాంలో రాష్ట్రానికి ఎంత మేరకు పెట్టుబడులు తెచ్చారు. ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారన్న అంశాన్ని బహిర్గతం చేయాలని వారు కోరారు.