కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది.. బండి సంజయ్
రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో కేసీఆర్ సర్కారు విఫలమైందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలకు ఇబ్బంది తప్పట్లేదన్నారు.
తద్వారా పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని వాపోయారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే... తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని.. అలాంటి వారి సేవలను విస్మరిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.