మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (13:20 IST)

అమరావతి ఆడపడుచులకు పృథ్వీ క్షమాపణలు చెప్పాల్సిందే: పోసాని

రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం సినీనటుడు పృథ్వీకి తగదని పోసాని అన్నారు. పృథ్వీలాంటి వారివల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పోసానీ చెప్పారు. పృథ్వీ వెంటనే మీడియా సమావేశం పెట్టి.. రైతులకు క్షమాపణ చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. రైతులను కించపరిచేలా ఎవరు మాట్లాడినా తాను సహించనని చెప్పుకొచ్చారు. 
 
రైతులకు కార్లు ఉంటే తప్పేంటి? అలాగే పంటను పండించే మహిళల చేతులకు బంగారు గాజులు ఉండకూడదా అంటూ.. పృథ్వీని పోసాని ప్రశ్నించారు. అలాగే.. జగన్ రైతులకు అన్యాయం చేయరని.. రైతులు శాంతించాలని ఆయన కోరారు. జగన్ తప్పక రైతులకు న్యాయం చేస్తారు. ఇప్పటివరకూ ప్రజల గురించి జగన్ ఒక్క మాట కూడా జారలేదన్నారు. కాగా.. అమరావతిలో రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జగన్‌కు ఇది తన విజ్ఞప్తి అంటూ పేర్కొన్నారు.
 
 ఏటా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చేసిన రైతులను పెయిడ్ ఆర్టిస్టులని వ్యాఖ్యానించినందుకు పృథ్వీ సిగ్గుపడాలని అన్నారు. పృథ్వీలాంటి వాళ్ల కారణంగానే రాష్ట్రంలోని ఆడవాళ్లు జగన్ మోహన్ రెడ్డి గాడు అని తిడుతున్నారని తెలిపారు.

వైసీపీలో తాను కూడా ఉన్నానని, తనతో పాటు రోజా కూడా పదేళ్లుగా పార్టీలోనే ఉన్నారని, తాము ఎప్పుడూ ఇలా మాట్లాడలేదని అన్నారు. కానీ, పృథ్వీలాంటి వాళ్లు ఈ మూడ్నాలుగేళ్లలో వచ్చి చేరారని విమర్శించారు.