శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (19:20 IST)

రాజధాని తరలింపు: పదిమంది మృతి.. ఏంటయ్యా ఇది..? బాబు ప్రశ్న

రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసిందని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాడికొండ మండలంలో ఐదుగురు, తుళ్లూరు మండలంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ట్విట్టర్ ద్వారా చంద్రబాబు తెలిపారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణమంటూ మండిపడ్డారు. 
 
ఇంకా తేదీల వారీగా, పేరు, నియోజకవర్గం, మండలం, గ్రామంతో పాటు రాజధాని తరలింపు కోసం ప్రాణాలు కోల్పోయిన రైతుల పేర్లతో కూడిన వివరాలను చంద్రబాబు ట్విట్టర్‌లో పొందుపరిచారు. ఇందులో అక్కినేని ప్రవీణ్ (35) తుళ్లూరు రైతు.. రాజధాని తరలిపోతుందనే వార్త రావడంతోనే మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయారని.. ఇతడు 31.12. 2019 తేదీన మరణించినట్లు చంద్రబాబు తెలిపారు.