శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 8 జనవరి 2020 (19:12 IST)

ఆ 40 మంది చావుకి నువ్వే కారణం బాబూ: చంద్రబాబుపై ట్విట్టర్లో రివర్స్ ఎటాక్

రాజధాని తరలింపు ప్రకటనతో రైతులు గుండెపోటుతో చనిపోతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పలువురు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు. వాళ్ల చావుకి చంద్రబాబే కారణం అంటూ రీ-ట్వీట్లు చేస్తున్నారు. 
 
చంద్రబాబు ఇలా రాశారు...  "రాజధాని తరలింపు ఆందోళనలతో గత 9 రోజుల్లో 10 మంది మృతిచెందడం కలిచివేసింది. తాడికొండ మండలంలో 5 గురు, తుళ్లూరు మండలంలో 5 గురు చనిపోయారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులు, రైతు కూలీ కుటుంబాల్లో ఈ విషాదానికి వైసీపీ ప్రభుత్వ నిర్వాకాలే కారణం
 
మొన్న ఇసుక మాఫియా ఆగడాలతో 60 మంది భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, 200 రోజుల్లో 280 మంది రైతుల ఆత్మహత్యలు, ఇప్పుడు రాజధాని మార్పుపై ఆందోళనతో 10 మంది మృతి. ఈ సమస్యలన్నీ వైసీపీ సృష్టించినవే.
 
ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు, ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. స్వార్థం, అవినీతి, అక్రమాలు, అసమర్ధతతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేసారు. దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు"