మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (19:34 IST)

గోవిందరాజస్వామివారి ఆలయంలో ముగిసిన పంగుణోత్తర ఉత్సవం

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో గల శ్రీ పుండరీకవళ్లి (సాలైనాంచియార్‌) అమ్మవారి పంగుణి ఉత్తర ఉత్సవం ఆది‌వారం ఘనంగా ముగిసింది.
 
ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి విశ్వరూప సర్వదర్శనం కల్పించారు. అనంతరం ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఉదయం శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధిలో వేడుకగా స్నపన తిరుమంజనం జరిగింది. అనంతరం ఆస్థానం నిర్వహించారు.
 
సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ పుండరీకవళ్లి అమ్మవారిని ఆలయ విమానప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఆ త‌రువాత‌ ఊంజల్‌సేవ నిర్వ‌హించారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ‌ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఏఈవో ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు  వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు మునీంద్ర‌బాబు, కామ‌రాజు,  అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.